SSC JE 2023 1324 పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల|SSC JE Recruitment 2023 Full Details in Telugu
SSC నుండి 1324 పోస్టులతో JE (సివిల్,మెకానికల్,ఎలక్ట్రికల్) విభాగంలో భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 26 జులై 2023 నుండి 16 ఆగస్టు 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు SSC విడుదల చేసిన SSC JE 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
SSC జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023 పూర్తి వివరాలు
SSC JE 2023 : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఇటీవల విడుదల చేసిన 1324 JE ఉద్యోగాలలో సివిల్,ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ మొదలగు విభాగాలలో పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు SSC JE ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్డులు SSC అధికారిక వెబ్సైటు కూడా సందరహించవచ్చు.
SSC JE 2023 పూర్తి వివరాలు
సంస్థ | స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | జూనియర్ ఇంజనీర్ (సివిల్,మెకానికల్ & ఎలక్ట్రికల్) |
ఖాళీల సంఖ్య | 1324 పోస్టులు |
జీతం | ₹35400-112400/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | ssc.nic.in |
SSC JE 2023 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు
దరఖస్తూ ప్రారంభ తేదీ | 26 జలై 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 16 ఆగస్టు 2023 |
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ | 17 నుండి 18 ఆగష్టు వరకు |
పరీక్ష తేదీ | అక్టోబర్ లో ఉంటుంది |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
SSC JE 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే SSC అధికారిక వెబ్సైటు ద్వారా JE ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 16 ఆగస్టు 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | 100/- |
SC,ST,PWD & స్త్రీలు | 0/- |
SSC JE ఉద్యోగాలకు వయస్సు అర్హత
SSC JE 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే SSC ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. SSC జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
- కనిష్త వయస్సు – 18 సంవత్సరాలు
- గరిష్త వయస్సు కొన్నిటికి – 32 సంవత్సరాలు & 30 సంవత్సరాలు
- వయస్సు లెక్కించ వలసిన తేదీ : 16 ఆగస్టు 2023
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
SSC JE మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
JE ( జూనియర్ ఇంజనీర్) | 1324 | ₹35,400 – 1,12,400/- |
SSC JE ఉద్యోగాల అర్హతలు
SSC JE ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
SSC JE 2023 ఎంపిక ప్రక్రియ
- వ్రాత పరీక్ష (CBT)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
- మెడికల్ పరీక్ష
- ఎంపిక
పరీక్ష సరళి
కింద ఇవ్వబడిన విదంగా ఆన్లైన్ విధానములో రెండు పేపర్లుగా నిర్వహించబడుతుంది:
పేపర్-I పరీక్షా సరళి (CBT)
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ | 50 | 50 | 2 గంటలు (పారా-9.1, 9.2 మరియు 9.3 ప్రకారం స్క్రైబ్‌కు అర్హత పొందిన అభ్యర్థులకు 2 గంటల 40 నిమిషాలు) |
జనరల్ అవేర్నెస్ | 50 | 50 | |
పార్ట్-ఎ: జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ & స్ట్రక్చరల్) లేదా పార్ట్-బి: జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) లేదా పార్ట్-సి: జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) | 100 | 100 |
పేపర్-II పరీక్షా సరళి (CBT)
విషయం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
పార్ట్-ఎ: జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ & స్ట్రక్చరల్) లేదా పార్ట్-బి: జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) లేదా పార్ట్-సి: జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) | 100 | 300 | 2 గంటలు (పారా-9.1, 9.2 మరియు 9.3 ప్రకారం స్క్రైబ్‌కు అర్హత పొందిన అభ్యర్థులకు 2 గంటల 40 నిమిషాలు) |
పేపర్-I & పేపర్-IIలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రశ్నలు హిందీ & ఇంగ్లీషు రెండింటిలోనూ సెట్ చేయబడతాయి. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ MCQs టైప్‌లో ఉంటాయి. పేపర్-I మరియు పేపర్-II యొక్క భాగాలు-I, II మరియు IIIలో ప్రశ్నలు హిందీ మరియు ఆంగ్లంలో సెట్ చేయబడతాయి. పేపర్-I & పేపర్-IIలోని ప్రతి తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 1/3వ వంతుకు సమానమైన నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
SSC JE 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
SSC JE 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 16 ఆగస్టు 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి SSC జూనియర్ ఇంజనీర్ దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి SSC జూనియర్ ఇంజనీర్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- SSC JE 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 26 జూలై 2023 నుండి 16 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- SSC జూనియర్ ఇంజనీర్ 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
- SSC జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ కోసం అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
- SSC జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
- దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
- అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
- ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
SSC JE 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |
ఎస్ఎస్సి జెఇ (SSC JE) 2023 లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి
SSC ఈసారి 1324 పోస్టులతో JE (సివిల్,మెకానికల్,ఎలక్ట్రికల్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
B. Tech ECE SSC JEకి దరఖాస్తు చేయవచ్చా?
చేయవచ్చు. ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు SSC JE 2023 నోటిఫికేషన్ కు అర్హులు.
7 thoughts on “SSC JE 2023 1324 పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల|SSC JE Recruitment 2023 Full Details in Telugu”