SWR Recruitment 2023 టెక్నికల్ అసోసియేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|SWR Recruitment 2023 Full Details in Telugu
SWR (South Western Railway) నుండి 35 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ & జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 28 జులై 2023 నుండి 17 ఆగస్టు 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు South Western Railway విడుదల చేసిన SWR Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
SWR Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
SWR Recruitment 2023 : సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ఇటీవల విడుదల చేసిన 35 ఉద్యోగాలలో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ మరియు జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 24 STA పోస్టులను సివిల్ ఇంజనీరింగ్, 07 STA&JTA ఉద్యోగాలను సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ మరియు 04 STA పోస్టులను ఎలక్ట్రికల్ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో రైల్వే ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు SWR ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు South Western Railway అధికారిక వెబ్సైటును కూడా సందర్శించవచ్చు.
SWR Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | సీనియర్ టెక్నికల్ అసోసియేట్ మరియు జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు |
ఖాళీల సంఖ్య | 35 పోస్టులు |
జీతం | ₹25000 – 37,000/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.swr.indianrailways.gov.in |
SWR Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
దరఖస్తూ ప్రారంభ తేదీ | 28 జులై 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 17 ఆగస్టు 2023 |
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ | 17 ఆగస్టు 2023 |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
SWR Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే South Western Railway అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయండి.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | ఫీజు లేదు |
SC,ST &PWD ఆడవాళ్ళు | ఫీజు లేదు |
SWR Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత
SWR Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే SWR ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. SWR నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్ – 20 నుండి 34 సంవత్సరాలు |
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ – 18 నుండి 32 సంవత్సరాలు |
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్మెంట్
- SSC JE 2023 నోటిఫికేషన్
- AAICLAS Recruitment 2023
- AP District Court Recruitment 2023
- NIACL AO Recruitment 2023
SWR Recruitment మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్ | 31 |
‘Z’ క్లాస్ : ₹32,000/- ‘Y ‘ క్లాస్ : ₹34,000/- ‘X ‘ క్లాస్ : ₹37,000/- |
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ | 04 |
‘Z’ క్లాస్ :₹25,000/- ‘Y ‘ క్లాస్ : ₹27,000/- ‘X’ క్లాస్ : ₹30,000/- |
SWR ఉద్యోగాల అర్హతలు
SWR ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్ –
- సివిల్ ఇంజినీరింగ్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజినీరింగ్ ప్రాథమిక స్ట్రీమ్‌ల యొక్క ఏదైనా సబ్ స్ట్రీమ్ కలయికలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ.
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్(S&T) –
- ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా M.Sc ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ / ప్రాథమిక స్ట్రీమ్‌లో ఏదైనా సబ్-స్ట్రీమ్ కలయికలో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ –
- ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ఏదైనా సబ్‌స్ట్రీమ్‌ల కలయిక. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ నుండి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్(ఎలక్ట్రికల్) –
- మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇంజనీరింగ్ ప్రాథమిక స్ట్రీమ్‌ల యొక్క ఏదైనా సబ్ స్ట్రీమ్ కలయికలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇన్స్టిట్యూట్
SWR Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
సీనియర్ టెక్నికల్ అసోసియేట్: మునుపటి 05 సంవత్సరాలలో (అంటే 2019 మరియు 2023 మధ్య) నిర్వహించిన గేట్ పరీక్షల్లో ఏదైనా ఒకదానిలో పొందిన ‘గేట్ స్కోర్’ ఆధారంగా అభ్యర్థి షార్ట్‌లిస్ట్ చేయబడతారు మరియు ఒరిజినల్స్ స్క్రీనింగ్ మరియు వెరిఫికేషన్ కోసం పిలవబడతారు.
జూనియర్ టెక్నికల్ అసోసియేట్‌లు: జూనియర్ టెక్నికల్ అసోసియేట్ కేటగిరీలోని ఖాళీల సంఖ్యకు 1:1 నిష్పత్తిలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో పొందిన “శాతం మార్కుల” ఆధారంగా అభ్యర్థి షార్ట్‌లిస్ట్ చేయబడి, ఒరిజినల్ పత్రాల స్క్రీనింగ్ మరియు వెరిఫికేషన్ కోసం పిలవబడతారు. ఒకవేళ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా STA పోస్ట్‌కు సూచించిన ఇతర విద్యార్హత ఉన్న అభ్యర్థులు JTA పోస్ట్‌కి దరఖాస్తు చేసుకుంటే, అటువంటి విద్యార్హతలో వారు పొందిన మార్కుల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు మరియు విద్యార్హత ఉన్న అభ్యర్థులతో సమానంగా పరిగణించబడుతుంది.
SWR Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
SWR Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 17 ఆగస్టు 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి SWR దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి SWR దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- SWR Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 28 జులై 2023 నుండి 17 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- SWR Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
- SWR ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
- SWR రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
- దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
- ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
SWR Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |