RITES Recruitment 2023 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|RITES Junior Assistant (HR) Recruitment 2023 Full Details in Telugu
RITES నుండి 16 జూనియర్ అసిస్టెంట్ (HR) ఉద్యోగాలను పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 12 ఆగస్టు 2023 నుండి 04 సెప్టెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు RITES విడుదల చేసిన RITES Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
RITES Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
RITES Recruitment 2023 : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసే మినిరత్న పబ్లిక్ సెక్టార్ ఎంట్రప్రైజ్ కాబట్టి ఇక్కడ జాబ్ వస్తే రాల్వేలో ఉద్యోగం సంపాదించినట్టే. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. RITES ఇటీవల విడుదల చేసిన 16 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో అదిగాక రైల్వే డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు RITES Junior Assistant (HR) ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RITES అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.
RITES Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | జూనియర్ అసిస్టెంట్ (HR) పోస్టులు |
ఖాళీల సంఖ్య | 16 పోస్టులు |
జీతం | ₹63,500/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.rites.com |
RITES Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
దరఖస్తూ ప్రారంభ తేదీ | 12 ఆగస్టు 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 04 సెప్టెంబర్ 2023 |
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ | 04 సెప్టెంబర్ 2023 |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
RITES Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే RITES అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను RTGS/NEFT ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI/ డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 04 సెప్టెంబర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC | 600/- |
EWS,SC,ST &PWD | 300/- |
ఫీజు పే చేసే ముందు కింద ఇచ్చిన సమాచారం గమనించండి:
RITES Recruitment 2023 ఉద్యోగాలకు వయస్సు అర్హత
RITES Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే RITES Junior Assistant (HR) ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. RITES Junior Assistant (HR) నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
జూనియర్ అసిస్టెంట్ (HR) – 18 నుండి 30 సంవత్సరాలు |
# మీకోసం మరిన్ని రైల్వే ఉద్యోగాలు
- SWR Recruitment 2023
- MP Metro Rail Recruitment 2023
- IDEED Sub Staff Recruitment 2023
- HQ Army Training Command Shimla Recruitment 2023
- APCOS Recruitment 2023
RITES Recruitment 2023 మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
జూనియర్ అసిస్టెంట్ (HR) | 16 | ₹20,000 – 66,000/- |
RITES Junior Assistant (HR) ఉద్యోగాల అర్హతలు
RITES ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
జూనియర్ అసిస్టెంట్ (HR) –
- ప్రభుత్వం చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదో ఒక విభాగంలో డిగ్రీ 50% మార్కులతో పాసై ఉండాలి. (sc,st,obc & pwd అభ్యర్థులు 45% మార్కులతో పాస్ చాలు)
- ఎటువంటి అనుభవం అవసరంలేదు.
RITES Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
- 100% రాత పరీక్ష ద్వారా
- మెడికల్ టెస్ట్
RITES Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
RITES Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 04 సెప్టెంబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి RITES Junior Assistant (HR) ఉద్యోగాలకు దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి RITES దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- RITES Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 12 ఆగస్టు 2023 నుండి 04 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- RITES Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
- RITES Junior Assistant (HR) ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
- RITES రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
- దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
- అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
- ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
RITES Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |