RBI Assistant Recruitment 2023 450 అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|RBI Assistant Recruitment 2023 Full Details in Telugu
RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుండి 450 అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 13 సెప్టెంబర్ 2023 నుండి 04 అక్టోబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు RBI విడుదల చేసిన RBI Assistant Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
RBI Assistant Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
RBI Assistant Recruitment 2023 : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మన కోసం 450 అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చూడండి RBI లో పెర్మనెంట్ జాబ్ కొట్టాలంటే ఇది చక్కటి అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు RBI ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RBI అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.
RBI Assistant Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | అసిస్టెంట్ పోస్టులు |
ఖాళీల సంఖ్య | 450 పోస్టులు |
జీతం | ₹20,700 – 55,700/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.rbi.org.in |
RBI Assistant Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
దరఖస్తూ ప్రారంభ తేదీ | 13 సెప్టెంబర్ 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 04 అక్టోబెర్ 2023 |
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ | 04 అక్టోబెర్ 2023 |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
RBI Assistant Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే RBI అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను ఆన్లైన్ ద్వారా (క్రెడిట్ / డెబిట్ కార్డ్ ) ఫీజును చెల్లించేదుకు 04 అక్టోబెర్ చివరి తేదీ గా నిర్ణయించడం జరిగింది.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | 450/- + 18% GST |
SC,ST &PWD | 50/- + 18% GST |
RBI Assistant Recruitment 2023 ఉద్యోగాలకు వయస్సు అర్హత
RBI Assistant Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే RBI ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. RBI నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
- కనీష్ట వయస్సు : 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు
- SC,ST వయస్సు : 33 సంవత్సరాలు
- OBC వయస్సు : 31 సంవత్సరాలు
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- AIASL Recruitment 2023
- Dr.YSR University Recruitment 2023
- ONGC Apprentice Recruitment 2023
- Sainik School Rewari Recruitment 2023
- IGM Hyderabad Supervisor Recruitment 2023
- Army HQ Dakshin Bharat Area Recruitment 2023
- ICFRE RFRI Recruitment 2023
- Army HQ Westren Command Recruitment 2023
- CSIR CLRI Recruitment 2023
RBI Assistant Recruitment మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
అసిస్టెంట్ పోస్టులు | 450 | ₹20,700 – 55,700/- |
అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు చేరగానే ₹47,849/- జీతం వస్తుంది
RBI Assistant Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు
RBI ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
అసిస్టెంట్ –
- అభ్యర్థి ఏదయినా విభాగంలో కనీసం 50% మార్కులతో డిగ్రీ పాసవ్వాలి.
- కంప్యూటర్ లో వర్డ్ ప్రాసెసింగ్ & MS Office లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
- అభ్యర్థి ఎక్కడికయితే దరఖాస్తు చేస్తున్నాడో అక్కడి లోకల్ భాష లో మంచి పట్టు ఉండాలి ( రాయడం,చదవడం & మాట్లాడ్డం)
RBI Assistant Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్ష ( ప్రిలిమినరీ & మెయిన్స్)
- లాంగ్వేజ్ ప్రొఫీసియన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
RBI ప్రిలిమినరీ పరీక్ష విధానం
క్రమ సంఖ్య | సబ్జెక్టు | మొత్తం ప్రశ్నలు | మొత్తం మార్కులు | మొత్తం సమయం |
1 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 30 | 30 | 20 నిమిషాలు |
2 | న్యూమరికల్ ఎబిలిటి | 35 | 35 | 20 నిమిషాలు |
3 | రిజనింగ్ | 35 | 35 | 20 నినిమిషాలు |
👉 | మొత్తం | 100 | 100 | 60 నిమిషాలు |
RBI మెయిన్స్ పరీక్షా విధానం
క్రమ సంఖ్య | సబ్జెక్టు | మొత్తం ప్రశ్నలు | మొత్తం మార్కులు | మొత్తం సమయం |
01 | రిజనింగ్ | 40 | 40 | 30 నిమిషాలు |
02 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 40 | 40 | 30 నిమిషాలు |
03 | న్యూమరికల్ ఎబిలిటి | 40 | 40 | 30 నిమిషాలు |
04 | జనరల్ అవేర్నెస్ | 40 | 40 | 25 నిమిషాలు |
05 | కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 40 | 20 నిమిషాలు |
👉 | మొత్తం | 200 | 200 | 135 నిమిషాలు |
RBI లాంగ్వేజ్ ప్రొఫీసియన్సీ టెస్ట్ విధానం
అభ్యర్థికి మెయిన్స్ పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ తీసి LPT కి ఎంపిక చేస్తారు. లాంగ్వేజ్ ప్రొఫీసియన్సీ టెస్ట్ లో భాగంగా అతని లోకల్ లాంగ్వేజ్ లో ఎంత మాత్రం ప్రతిభ ఉందో పరీక్ష చేస్తారు. కింద రాష్ట్రాల వారీగా లోకల్ లాంగ్వేజ్ ఇవ్వబడ్డాయి
RBI Assistant Recruitment 2023 పరీక్షా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం:
ప్రిలిమినరీ పరిక్ష కోసం | మెయిన్స్ పరీక్ష కోసం |
Chirala, Guntur, Hyderabad, Kakinada, Kurnool, Nellore, Rajahmundry, Tirupati, Vijayawada, Vishakhapatnam, Vizianagaram | Kakinada, Kurnool, Rajahmundry, Tirupati, Vijayawada, Vishakhapatnam, Vizianagaram |
తెలంగాణ రాష్ట్రం:
ప్రిలిమినరీ పరిక్ష కోసం | మెయిన్స్ పరీక్ష కోసం |
Hyderabad, Karimnagar, Khammam, Warangal | Hyderabad |
RBI Assistant Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
RBI Assistant Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 04 అక్టోబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి RBI దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి RBI దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- RBI Assistant Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 13 సెప్టెంబర్ 2023 నుండి 04 అక్టోబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- RBI Assistant Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
- RBI Assistant ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
- RBI Assistant రిక్రూట్మెంట్కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
- దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
- అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
- ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
RBI Assistant Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |