Army HQ Dakshin Bharat Area Recruitment 2023 LDC, కుక్ & MTS పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Army HQ Dakshin Bharat Area Recruitment 2023 Full Details in Telugu

Army HQ Dakshin Bharat Area Recruitment 2023

Army HQ Dakshin Bharat Area Recruitment 2023 LDC, కుక్ & MTS పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Army HQ Dakshin Bharat Area Recruitment 2023 Full Details in Telugu

Army HQ Dakshin Bharat Area నుండి 12 LDC, కుక్ & MTS ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 02 సెప్టెంబర్ 2023 నుండి 22 సెప్టెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు HQ Dakshin Bharat Area విడుదల చేసిన Army HQ Dakshin Bharat Area Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Army HQ Dakshin Bharat Area Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Army HQ Dakshin Bharat Area Recruitment 2023 : ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దక్షిన్ భారత్ ఏరియా ఇటీవల విడుదల చేసిన 12 ఉద్యోగాలలో లోయర్ డివిజన్ క్లర్క్, కుక్ & అటెండర్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు HQ Dakshin Bharat Area ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు HQ Dakshin Bharat Area అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Army HQ Dakshin Bharat Area Recruitment 2023

Army HQ Dakshin Bharat Area Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దక్షిన్ భారత్ ఏరియా
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు లోయర్ డివిజన్ క్లర్క్, కుక్ & అటెండర్ పోస్టులు
ఖాళీల సంఖ్య 12 పోస్టులు
జీతం ₹18000 – 63,200/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.indianarmy.nic.in

Army HQ Dakshin Bharat Area  Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 02 సెప్టెంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 22 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 22 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

Army HQ Dakshin Bharat Area Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే HQ Dakshin Bharat Area అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోండి, ఇది నిరుద్యోగులకు చక్కటి అవకాశం.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS ఫీజు లేదు
SC,ST &PWD ఆడవాళ్ళు  ఫీజు లేదు

HQ Dakshin Bharat Area Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

Army HQ Dakshin Bharat Area Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే ఈ ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. HQ Dakshin Bharat Area నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీస వయస్సు అవసరం: – 18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి: – 25 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

Army HQ Dakshin Bharat Area  Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
లోయర్ డివిజన్ క్లర్క్ 01 ₹19,900/- బేసిక్ పే
కుక్ 02 ₹19,900/- బేసిక్ పే
MTS ( మెసెంజర్) 07 ₹18,000/- బేసిక్ పే
MTS ( తోటమాలి) 02 ₹18,000/- బేసిక్ పే

Army HQ Dakshin Bharat Area  ఉద్యోగాల అర్హతలు

HQ Dakshin Bharat Area ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

లోయర్ డివిజన్ క్లర్క్ ( LDC)

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
  • టైపింగ్ వేగం: కంప్యూటర్‌లో ఇంగ్లీషు టైపింగ్ @ 35 wpm లేదా హిందీ టైపింగ్ @ 30 wpm. (నిమిషానికి 35 పదాలు మరియు 30 wpm 10500/9000 KDPHకి అనుగుణంగా ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌లు).

కుక్ –

  • పదో తరగతి పాసైన వాళ్లు అర్హులు
  • భారతీయ వంటకాలలో ప్రావీణ్యం ఉండాలి

MTS ( మెసెంజర్) –

  • పదో తరగతి పాసైతే చాలు

MTS ( తోటమాలి) –

  • పదో తరగతి పాసైతే చాలు

Army HQ Dakshin Bharat Area  Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

MTS మరియు కుక్ ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష : రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. రాత పరీక్షకు అనుమతించబడిన మొత్తం సమయం 2 గంటలు. ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కు క్రింద ఇవ్వబడింది: –

పరీక్ష పేరు ప్రశ్నలు మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 25
ఆంగ్ల భాష 50 50
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 25
సాధారణ అవగాహన 50 50
మొత్తం 150 150

వ్రాత పరీక్ష నిర్వహించబడుతుంది, ఇందులో సంబంధిత పోస్ట్‌కు అవసరమైన విద్యార్హత ప్రకారం 10వ తరగతి/12వ తరగతి/ఐటీఐ స్థాయి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ భాషలో మాత్రమే పరీక్ష పెట్టడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ : షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు, లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డిసి) పోస్టుల కోసం స్కిల్ టెస్ట్‌ల కోసం కాల్ లెటర్‌లు జారీ చేయబడతాయి మరియు కుక్ పోస్టుకు  వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. తుది మెరిట్ ఆధారంగా ఎంపిక ఖచ్చితంగా చేయబడుతుంది.

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఎంపిక ప్రక్రియ

టైర్ –  I: రాత పరీక్ష నాలుగు పేపర్లను కలిగి ఉంటుంది. వ్రాత పరీక్షకు అనుమతించబడిన మొత్తం సమయం – 60 నిమిషాలు. ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కు క్రింద ఇవ్వబడింది: –

పరీక్ష పేరు ప్రశ్నలు మార్కులు
రీజనింగ్ సామర్థ్యం 25 50
ఆంగ్ల భాష 25 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 50
సాధారణ అవగాహన 25 50
మొత్తం 100 200

టైర్ –  II:  (2 గంటల 15 నిమిషాలు)

విభాగం పరీక్ష పేరు ప్రశ్నలు మార్కులు
విభాగం – I (ఒక గంట) గణిత సామర్థ్యాలు 30 90
రీజనింగ్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ 30 90
విభాగం – II (ఒక గంట) ఆంగ్ల భాష మరియు గ్రహణశక్తి 40 120
సాధారణ అవగాహన 20 60
విభాగం – III (15 నిమి.) కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ 15 45

నైపుణ్య పరీక్ష / టైపింగ్ టెస్ట్: కంప్యూటర్‌లో @ 35 wpm లేదా హిందీ టైపింగ్ @ 30 wpm. (నిమిషానికి 35 పదాలు మరియు 30 wpm 10500/9000 KDPHకి అనుగుణంగా ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌లు.

Army HQ Dakshin Bharat Area  Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

HQ Dakshin Bharat Area Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో సమర్పణ ప్రక్రియ 22 సెప్టెంబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • HQ Dakshin Bharat Area Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 02 సెటెంబర్ 2023 నుండి 22 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • HQ Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • ఈ ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అన్ని సరి చూసుకున్న తరవాత కింద ఇచ్చిన అడ్రెస్ కి సెండ్ చేయాలి

అడ్రెస్ : ‘ప్రిసైడింగ్ ఆఫీసర్ C/o ఆఫీసర్ కమాండింగ్ ట్రూప్స్, హెడ్ క్వార్టర్స్ దక్షిణ్ భారత్ ఏరియా, ఐలాండ్ గ్రౌండ్స్, చెన్నై – 600 009′

Army HQ Dakshin Bharat Area ఉద్యోగాలకు అవసరమైన డాకుమెంట్స్

దరఖాస్తుతో పాటు కింది సర్టిఫికెట్ల కాపీలను పంపాలి. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు పంపకూడదు.

  • విద్యా మరియు వృత్తిపరమైన అర్హత సర్టిఫికెట్లు.
  • అభ్యర్థి రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందినవారైతే కుల ధృవీకరణ పత్రం.
  • జనన ధృవీకరణ పత్రం కాపీ
  • డొమిసైల్ సర్టిఫికేట్ & రెసిడెన్షియల్ సర్టిఫికేట్.
  • ఒక కాపీ ఆధార్ కార్డ్/ ఏదైనా ఇతర ID కార్డ్.
  • అనుభవ ధృవీకరణ పత్రం కాపీ, ఉంటేనే.
  • EWS సర్టిఫికెట్ కాపీ
  • ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ల యొక్క రెండు కాపీలు ఒక ఫోటో కి రివర్స్ లో గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయాయించాలి.
  • 23 సెం.మీ x 10 సెం.మీ పరిమాణంలో రెండు సొంత చిరునామా గల ఎన్వలప్‌లు మరియు ప్రతి కవరుపై రూ. 25/- పోస్టల్ స్టాంప్‌ను అతికించండి
  • ప్రస్తుత యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (దరఖాస్తుదారు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగి అయితే).
  • దరఖాస్తు ఫారమ్‌తో అవసరమైన ఇతర పత్రాలను జత చేయండి.

Army HQ Dakshin Bharat Area Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *