బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్(BNP) నుండి 111 ఉద్యోగాల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో సూపెర్వైజర్,జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ మొదలగు ఉద్యోగాలు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.ఈ ఉద్యోగాలకు 22 జులై 2023 నుండి 21 ఆగస్టు 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి తెలుసుకుని దరఖాస్తు చేయండి.
బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ ముఖ్య సమాచారం
సంస్థ పేరు | బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాల సంఖ్య | 111 |
పోస్టింగ్ | భారతదేశంలో ఎక్కడైనా |
ఉద్యోగాలు | సూపెర్వైజర్,జూ.ఆఫీసు అసిస్టెంట్&జూ. టెక్నీషియన్ |
అధికారిక వెబ్సైటు | bnpdewas.spmcil.com |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
ప్రారంభ తేదీ | 22/07/2023 |
చివరి తేదీ | 21/08/2023 |
బ్యాంక్ నోట్ ప్రెస్ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము
బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫారమ్‌లోని వివరాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకున్న తర్వాత, అభ్యర్థులు బ్యాంక్ నోట్ ప్రెస్, దివాస్ (BNP) వెబ్‌సైట్ ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్‌వే ద్వారా సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. ఈ ఫీజు ను ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ / క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫీజు చెల్లింపుకు 21 ఆగస్టు 2023 రాత్రి 23.59 గంటల వరకు సమయం ఉంటుంది, ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరి | దరఖాస్తు ఫీజు |
జనరల్,OBC&EWS | ₹600/- |
మిగతా అందరూ | ₹200/- |
బ్యాంక్ నోట్ ప్రెస్ ఉద్యోగాల వయస్సు పరిమితి
బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్‌మెంట్ 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు లెక్కించడానికి పదవ తరగతి లేదా తత్సమాన/జనన ధృవీకరణలో ఉన్న తేదిని మాత్రమే తీసుకుంటారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఉండవలసిన వయస్సు పరిమితి కింద ఇవ్వడం జరిగింది గమనించండి:
- కనిస వయస్సు – 18 సం,లు
- గరిష్త వయస్సు – 25 సం,లు
SC,ST & OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వయస్సు లో రిలాక్స్యషన్ గలదు.
బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ ఉద్యోగ ఖాళీలు మరియు జీతం వివరాలు
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య | జీతం |
సూపెర్వైజర్ | 11 | రూ. 27,600–95,910/- |
జూ.ఆఫీసు అసిస్టెంట్ | 04 | రూ. 21,540–77,160/- |
జూ. టెక్నీషియన్ | 96 | రూ. 18,780–67,390/- |

బ్యాంక్ నోట్ ప్రెస్ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు
సూపర్‌వైజర్
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ లేదా పాలిటెక్నిక్‌ల నుండి ప్రింటింగ్ టెక్నాలజీ/ఇంజనీరింగ్/ ప్రింటింగ్/ మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ లో ఫుల్ టైమ్ డిప్లొమా లేదా
- బి.టెక్ / BE / B.Sc. సంబంధిత ట్రేడ్‌లో ఇంజనీరింగ్ కూడా పరిగణించబడుతుంది.
- వయోపరిమితి: 30 సంవత్సరాలు
- మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేట్.
- ఇంగ్లీషు లో 40 wpm లేదా
- హింది లో 30 wpm కంప్యూటర్‌లో టైపింగ్ అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం.
- వయోపరిమితి: 28 సంవత్సరాలు
జూనియర్ టెక్నీషియన్
- సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT నుండి గుర్తింపు పొందిన యూనివరిసిటీ నుండి ఫుల్ టైం ITI సర్టిఫికెట్.
- వయోపరిమితి: 25 సంవత్సరాలు
- పుర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
ఎంపిక ప్రక్రియ
- వ్రాత పరీక్ష
- స్కిల్/ప్రొఫిషియన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 21 ఆగస్టు 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. ఈ ఉద్యోగాలకు దరఖస్తూ చేయడంలో ఏమాత్రం ఆలస్యం అయినా ఎట్టిపరిస్థితుల్లో వాటిని అంగీకరించరు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న పోస్ట్‌కు సంబంధించి పూర్తి అర్హతలు ఉన్నాయో లేదో బాగా గమించుకోవాలి.
- బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్‌మెంట్ 2023 కి అభ్యర్థి 22 జూలై 2023 నుండి 21 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- కావాల్సిన అన్ని పత్రాలను ఉన్నాయో లేదో సరి చూసుకోండి.
- బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్ రిక్రూట్‌మెంట్ కోసం అవసరమైన అన్ని పత్రాలను తనిఖీ చేయండి – అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, ప్రాథమిక వివరాలు.
- బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు అన్ని వరసలను జాగ్రత్తగా తనిఖీ చేసి ప్రివ్యూ చేయాలి.
- అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా సమర్పించాలి. మీకు అవసరమైన దరఖాస్తు రుసుము చెల్లించక పోతే మీ ఫారమ్ పూర్తి అవ్వదు.
- ఫైనల్ సమర్పించిన ఫారమ్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడానికి | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైటు | ఇక్కడ నొక్కండి |
మరిన్ని ఉద్యోగ వివరాలు | ఇక్కడ నొక్కండి |
1 thought on “బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్మెంట్ 2023 111 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు చేసుకోండి.”